అటు ఫైరింగ్ ... ఇటు షూటింగ్
Sakshi | Updated: April 09, 2015 11:45 (IST)

చిత్తూరు: పోలీసుల ఎన్ కౌంటర్ చేశారంటేనే హడల్. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎవరైనా దగ్గరలో ఉంటే వారి గుండె ఆగినంత పని అవుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది హీరోయిన్ శృతిహాసన్ కి. మంగళవారం శేషాచల పర్వత ప్రాంతంలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు. అదే సమయంలో ఆ ప్రదేశానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో పులి చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఆ చిత్ర హీరోహీరోయిన్లు విజయ్, శృతిహాసన్ లు ఆ షూటింగ్ లో పాల్గొన్నారు.
సాయంత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత వారు తిరుగు ప్రయాణంలో తిరుపతి వస్తుండగా తలకొన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మరం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ జరిగిన విషయం చిత్ర యూనిట్ కు తెలిసింది. కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఎన్ కౌంటర్ అనేసరికి శృతి హాసన్ అవాక్కయినట్లు సమాచారం. మరోవైపు తిరుపతి పరిసర ప్రాంతాల్లో పులి చిత్ర షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో శ్రీదేవి, హాన్సిక, సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

No comments:
Post a Comment