Wednesday, 8 April 2015

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది కూలీలు కాదు స్మగ్లర్లే : బొజ్జల

ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది కూలీలు కాదు స్మగ్లర్లే
స్మగ్లర్లపైదాడులు అంతంకాదు...ఆరంభమే :బొజ్జల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 : ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ శేషాచలం అడవుల్లో నిన్న(మంగళవారం) జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది కూలీలు కాదని స్మగ్లర్లే అని స్పష్టం చేశారు. రాత్రిపూట అడవుల్లో గడ్డి కోయడానికి వచ్చారాని మంత్రి ప్రశ్నించారు.
 
స్మగ్లర్లపై దాడులు అంతంకాదు...ఆరంభమే అని బొజ్జల అన్నారు. స్మగ్లర్లతో సంబంధం ఉన్న వారు ఎంతటి పెద్ద నేతలైనా వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. స్మగ్లర్ల సెల్‌ఫోన్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో అన్ని విషయాలు వెల్లడి అవుతాయని మంత్రి బొజ్జల తెలిపారు.

No comments:

Post a Comment