ఆ ఎన్ కౌంటర్ సరైందే - ముద్దు కృష్ణమ్మ నాయుడు..
16:03 - April 8, 2015
తిరుపతి : శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్ పై విమర్శలు వస్తుంటే టిడిపి నేత ముద్దు కృష్ణమ్మ నాయుడు మాత్రం సమర్థించారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన సంపదను కాపాడడానికి పోలీసులు స్మగ్లర్లను ఎన్‌కౌంటర్ చేస్తే కొన్ని పార్టీలు విమర్శలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వాల అసమర్ధ పాలన వల్లే వేల కోట్ల రూపాయల ఎర్రచందనం స్మగ్లర్ల పాలయిందని విమర్శించారు. స్మగ్లర్లు ఎర్రచందనాన్ని తరలించుకుపోతుంటే..ఫారెస్టు అధికారులను చంపేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా..? అంటూ ముద్దు కృష్ణమనాయుడు ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను తాను అభినందిస్తున్నానన్నారు.
కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు
Sakshi | Updated: April 08, 2015 15:06 (IST)


No comments:
Post a Comment