కాసులు కురిపిస్తున్న ఎర్రచందనం, శ్రీ గంధం సాగు
https://www.youtube.com/watch?v=vi7U-9-QoeA
Anchor:
డబ్బులు
చెట్లకు కాస్తాయా! అంటే ఎవరైనా నవ్వి వూరుకోవటం సహజం.కానీ ఇప్పుడిది అంత తేలిగ్గా
తీసుకునే విషయం కాదు. కలపజాతి వృక్షాలు లక్షలు కురిపిస్తున్నాయి. నమ్ముకున్న
వారిని కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. బంగారంతో పోటీపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
స్మగ్లింగ్ పేరుతో ఉలిక్కిపడేలా చేస్తూ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో
వార్తల్లోకెక్కుతున్న కలప వృక్షాలు శ్రీగంధం, ఎర్రచందనం. టన్ను శ్రీ గంధం విలువ ఎంతో
తెలుసా! కోటి రూపాయల పైమాటే...అలాగే టన్ను ఎర్రచందనం 10 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఈ అటవీ
వృక్షాలను వ్యవసాయ భూముల్లో పెంచేందుకు రైతులు ఉవ్విళ్ళూరుతున్నారు. భవిషత్తుకు
బంగారుబాట వేసుకునేందుకు ఆశావహ దృక్పధంతో వీటి సాగు వైపు ముందడుగు వేస్తున్నారు.
వర్షాభావం, తీవ్ర నీటి
ఎద్దడి పరిస్థితులతో కునారిల్లే నల్గొండజిల్లాలో సైతం వీటి సాగు ఆశాజనకంగా వుంది. 7ఎకరాల బత్తాయి తోటలో
అంతర పంటగా 2వేల శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను నాటి
ఆశాజనకమైన ఫలితాలతో ముందుకు దూసుకుపోతున్న ఓ రైతు విజయగాథన ఎక్స్ ప్రెస్ టీవి
పాడిపంటలు మీ కందిస్తోంది,
చూడండి.
-------------------------------------
Voice
Over: 10సంవత్సరాల బత్తాయి తోటలో 8 సంవత్సరాల
క్రితం నాటిన ఈ కలప మొక్కలను చూశారా ఎంత ఏపుగా ఆశాజనకంగా పెరిగాయో.... కలప
మొక్కలేగా.. అని తేలిగ్గా కొట్టిపారేయకండి,వీటితో భవిషత్తులో కోట్ల రూపాయల ఆదాయం పొందే
దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు చిలక
విద్యాసాగర్ రెడ్డి. నల్గొండకు 10కిలో మీటర్ల
దూరంలో నాగార్జునసాగర్ రహాదారికి అనుకుని వున్న తిమ్మన్నగూడెం గ్రామంలో తన 7ఎకరాల బత్తాయి తోటను
కలపజాతి వృక్షాలతో నందనవనంగా తీర్చిదిద్దారు.
Small
montage....
Voice
Over: స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన విద్యాసాగర్ రెడ్డి మొక్కలతో నిత్య సహవాసం తన
జీవనంలో భాగం చేసకున్నారు.శాస్త్ర,సాంకేతిక పద్ధతుల పట్ల వున్న ఆసక్తి, కొత్త పంటలపై వున్న
మక్కువ, ఈయన్ను ఈ అటవీ
వృక్షాల సాగువైపు నడిపించాయి. బత్తాయలో అంతర పంటగా
2006-
07 సంవత్సరాల్లోశ్రీ గంధం,
ఎర్రచందనం
మొక్కలను ప్రయోగాత్మకంగా సాగుచేశారు.
బత్తాయి మొక్కలను ఎటు చూసినా 20అడుగుల ఎడంతో
నాటారు. ఎకరానికి 100 మొక్కలు
వచ్చాయి. నాటిన మొదటి 3సంవత్సరాల్లో
అంతపంటలతో ఆదాయం తీసిన ఈయన 4 వ సంవత్సరం
నుంచి అంతరపంటగా శ్రీగంధం,
ఎర్రచందనం
మొక్కలను సాగుకు ఎంచుకున్నారు. బత్తాయి చెట్ల మధ్య, చెట్టుకు 10అడుగుల దూరంలో శ్రీ గంధం మొక్కలను ఎకరాకు 150 మొక్కలు చొప్పున
నాటారు. ఎర్రచందనం మొక్కలను కూడా ఎకరాకు 150 మొక్కల చొప్పున బత్తాయి వరుసల మధ్య 10 అడుగుల దూరంలో నాటారు.
ప్రస్తుతం ఈ శ్రీ గంధం,
ఎర్రచందనం
చెట్లు మంచి పెరుగుదలతో ఆశాజనకంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఎర్రచందనం చెట్లు 15-30అడుగుల పొడవు పెరిగి
తోటకే అందాన్ని తెచ్చాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ గంధపు చెట్ల పెంపకాన్ని
స్వయంగా పరిశీలించిన ఈ రైతు,
పూర్తి
విషయ పరిజ్ఞానంతో సాగులో ముందుకు సాగటం వల్ల సాగులో సమస్యలు లేవు.
రైతు బైట్.....07-08 Byte: TC: 00:12 to 02:19,
12:11 to 12:15
Voice
Over: ఎర్రచందనం చెట్టు 60 అడుగుల ఎత్తు
వరకు పెరుగుతుంది. దీని కలపను ఆహార,వస్త్ర పరిశ్రమల్లో సహజ రంగుగా, వివిధ ఔషధాల తయారీలో ముఖ్యంగా లైంగిక
సామర్థ్యాన్ని పెంచే మందుల తయారీలో ఎక్కువగా వుపయోగిస్తున్నారు. ఇక కలపలో
ఎర్రచందనం తర్వాతే ఏదైనా...ప్రధానంగా జపాన్, చైనా, పశ్ఛిమ యూరప్ దేశాలు మన దేశం నుంచి
ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. గతంలో వీటిని పంట భూముల్లో పెంచటానికి
అనుమతి వుండేది కాదు. కానీ అంతరించిపోతున్న ఈ వృక్షాలను, అక్రమ నరికి వేతలను అరికట్టేందుకు కేంద్ర
ప్రభుత్వం 2001వ సంవత్సరం
నుంచి నిబంధనలను సరళించటంతో పెద్ద ఎత్తున
రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. కానీ చిన్న మొక్కల్లో బ్రతుకుదల శాతం తక్కువగా
వుండటంతో కనీసం 6-10నెలల వయసున్న
మొక్కలు నాటుకోవాల్సి వుంటుంది. ఒక్క ఎర్రచందనం చెట్టునుంచి 20సం.ల కాలంలో అరటన్ను
నుంచి టన్ను వరకు కలప దిగుబడినిస్తుంది. దీని ద్వారా కనీసం 500కిలోల చేవగల కలప
లభిస్తుంది. ఎర్రచందనం చాలా మొండి మొక్క. దీని సాగులో ఎటువంటి పెట్టుబడి అవసరం
తక్కువ. చెట్టు పెరిగే కొద్దీ ప్రధాన కాండంపై కొమ్మల సంఖ్యను తగ్గిస్తూ వుంటే
పెరుగుదల వేగంగా వుంటుందని గమనించి ఎప్పటికప్పుడు పక్క కొమ్మలను ప్రూనింగ్
చెస్తున్నారు. చెట్టు మొగలులో పక్క కొమ్మలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రైతు బైట్.....07-08 Byte: 02:44 to 03:11, 03:51 to 05:26, 06:01 to 06:48, 06:52 to 07:04
Voice
Over: గతంలో ఎర్రంచందంన సాగు చేస్తే కేసులు పెడతారనే భయం నెలకొనడంతో రైతులు వీటి
పెంపకానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పడా పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం, ఔషధ సుగంధ మొక్కల బోర్డు
ద్వారా ఈ చెట్ల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తోంది కాని దీని సాగు గురించి రైతుల్లో ఇంకా అనేక అపోహలు వున్నాయంటారు రైతు
చిలకా....
09:59
to 10:31, 05:45 to 06:00
Voice
Over: ప్రస్థుతం మన ప్రాంతంలో
టన్ను ఎర్రచందనం ధర గ్రేడును బట్టి 5 నుంచి 10లక్షలు
పలుకుతుంది. 20సంవత్సరాలకు
చెట్లలో మంచి చేవ వస్తుంది కనుక అప్పటినుంచి మార్కెట్ చేసుకోవచ్చు. కనుక ఎర్రచందనం
సాగు భవిషత్తుకు బంగారుబాట వేయటం ఖాయం అంటున్నారు రైతు.
బైట్.....09:02
to 09:53
Montage.....
Break:
Anchor:
చూశారా
ఎర్రచందనం సాగు ఎంత ఆశాజనకంగా వుందో... మరి డాలర్ల వర్షం కురిపిస్తున్న శ్రీ గంధం
సాగు గురించి రైతేమంటున్నారో చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.
Anchor:
పాడి
పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం
Anchor2:
ప్రపంచ
వ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యంత విలువైన మొక్క శ్రీ గంధం. హిందూ సాంప్రదాయం
ప్రకారం గంధలేని పూజ వుండదు. అలాగే వివిధ
ఔషధ, సుగంధ
పరిశ్రమల్లో, సౌందర్య సాధానాల
తయారీలో గంధానిదే ప్రముఖ పాత్ర. ఒకప్పుడు అటవీ ప్రాంతాలకే పరిమితమైన ఈ గంధపు
చెట్లను నేడు వాణిజ్య సరళిలో సాగుచేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు.అయితే గంధపు
చెట్లను ఎకరాలకు ఎకరాలు ప్రధాన పంటగా సాగుచేస్తామంటే కుదరదు. వీటిలో బతుకుదల శాతం
చాలా తక్కువ వుంటుంది. మరి రైతు విద్యాసాగర్ రెడ్డి ఈ సమస్యలను అధిగమించి సాగులో
ఎలా ముందుకు సాగుతున్నారు. ఈ చెట్లకు మార్కెట్ డిమాండ్ ఎలా వుంది? వంటి వివరాలను ఇప్పుడు
తెలుసుకుందాం.
-------------------------
Voice
Over: శ్రీ గంధం ఇతర చెట్లను ఆధారం చేసుకుని పెరిగే మొక్క. అందువల్ల దీనిని పరాన్న
భుక్కుగా చెబుతారు. ఈ చెట్ల వేర్లు భూమిలో 20అడుగుల వ్యాసంలో విస్తరించి ఇతర మొక్కల
వేర్లనుంచి 40శాతం వరకు
పోషాకాలను సంగ్రహించి పెరుగుతాయి. అందువల్ల శ్రీ గంధాన్ని ఏకపంటగా
సాగుచేసినప్పటికంటే అంతర పంటలుగా సాగుచేసినప్పుడు మంచిఫలితాలు వస్తున్నాయి. దీన్ని
క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విద్యాసాగర్ రెడ్డి తన బత్తయిని శ్రీ గంధానికి హోస్ట్
పంటగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల బత్తాయి దిగుబడిలో ఎటువంటి మార్పులేదు. శ్రీ
గంధం పెరుగుదల కూడా ఆశాజనకంగా వుంది. మొదట్లో ఈ మొక్కల బతుకుదల శాతం తక్కువగా
వున్నా, చనిపోయిన మొక్కల
స్థానంలో దఫదఫాలుగా కొత్త మొక్కలు నాటారు. అందువల్ల ఈయన తోటలో చెట్ల పెరుగుదల
వివిధ దశల్లో వుంది.
రైతు బైట్.....31-07 TC: 00:15 to 00:28,
00:41 to 01:59, 03:14 to 05:16, 05:22 to 07:27
Voice
Over: సాధారణంగా గంధపు చెట్లు 12-15అడుగులు ఎత్తు
పెరగుతాయి. నాటిన 10వ సంవత్సరం
నుంచి చెట్ల చేవ పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 20సంవత్సరాలకు ఒక్కో చెట్టు నుంచి 50 నుంచి 100కిలోల గంధం దిగుబడి
పొందవచ్చు. 2002 నుంచి 2009 సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర
సుగంధ మొక్కల బోర్డు ద్వారా సబ్సిడీ ఇచ్చి మరీ ప్రోత్సహించింది. ప్రస్థుతం సబ్సిడీ
లేకపోయినా ఈ చెట్ల సాగుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు.
బైట్ 31-07,
07:27 to 07:41, 01:59 to 02:29, 09:56
to10:31, 02:50 to 03:09,
10:31 to 11:06
Voice
Over: వేలు కాదు లక్షలు,
లక్షలు
కాదు కోట్లు ఈ కలప జాతి చెట్ల వెల, నేడు రైతు స్థాయిలో విలువ కట్టలేనిదిగా మారింది.రైతు చిలకా
విద్యాసాగర్ రెడ్డి బత్తాయి సాగులో ఏటా ఖర్చులు పోను ఎకారానికి 60వేల నికర లాభం
పొందుతున్నారు. దీనికితోడు ఈ కలప చెట్లను సాగుచేసి తన భవిషత్తుకు బంగారుబాట
వేసుకున్నారు. నల్గండజిల్లాలో అనేక మంది రైతులకు ఇప్పుడు ఈయన క్షేత్రం
స్పూర్తిదాయకంగా నిలిచింది. సాగు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు తనవంతు
కృషిచేస్తూ తోటి రైతులను ప్రోత్సహిస్తూ
ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతుకు
వ్యవసాయంలో విశ్రాంతి లేదనేది ఒట్టిమాటని, ఇటువంటి కలపచెట్ల సాగుచేస్తే వ్యవసాయ విరమణ
తర్వాత పూర్తి భరోసా లభిస్తుందని విద్యాసాగర్ రెడ్డి దీమా వ్యక్తంచేస్తున్నారు .
07-08
Byte: 11:08 to 12:23, 12:59 to 13:31
Graphics:
Title
Alfa: 'బంగారు గని'గా
శ్రీగంధం, ఎర్రచందనం సాగు
Name
strip: చిలక విద్యాసాగర్ రెడ్డి,
రైతు
plates:
బత్తాయి
బత్తాయి మొక్కలను
ఎటు చూసినా
20 అ. ఎడంతో నాటారు
STRIP: ఎకరానికి 100 మొక్కలు
plates:
బత్తాయి చెట్ల మధ్య,
చెట్టుకు 10అ. దూరంలో
శ్రీ గంధం మొక్కలను
ఎకరాకు 150 చొప్పున నాటారు.
STRIP:
వరుసల
మధ్య 10 అ. దూరం
plates:
ఎర్రచందనం సాగు
6-10నెలల వయసున్న
మొక్కలు నాటుకోవాల్సి
వుంటుంది.
plates:
ఎర్రచందనం సాగు
టన్ను ఎర్రచందనం ధర
గ్రేడును బట్టి
రూ. 5 నుంచి 10లక్షలు
పలుకుతుంది.
plates:
శ్రీగంధం సాగు
20సంవత్సరాలకు
ఒక్కో చెట్టు నుంచి
50 నుంచి 100కిలోల గంధం
దిగుబడి పొందవచ్చు.
plates:
బత్తాయి సాగు
ఏటా ఖర్చులు పోను
ఎకారానికి రూ. 60,000
నికర లాభం పొందుతున్నారు.
చిరునామా
చిలక విద్యాసాగర్ రెడ్డి,
తిమ్మన్నగూడెం గ్రామం,
నల్గొండ జిల్లా.
సెల్ నెం. 9490849484
No comments:
Post a Comment