|
తిరుపతి, ఏప్రిల్ 8 : ఎర్రచందనం అక్రమ రవాణాకు తమిళనాడు ప్రభుత్వం సహకరిస్తుందని మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం దుంగలను కొట్టుకెళ్లి చెన్నై ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎర్రచందనం కూలీలు రాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు. ఎర్రచందనంపై ఏపీకి తప్ప ఎవరికీ హక్కు లేదన్నారు. పోలీసులను స్మగ్లర్లు కొట్టి చంపినపుడు కాంగ్రెస్, వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆయన విమర్శించారు. ఎన్‌కౌంటర్‌పై చింతించాల్సిన పని లేదని, ఇది రొటీన్‌గా జరిగేదేనని ఆయన వివరించారు.
|
No comments:
Post a Comment