Wednesday, 8 April 2015

అడవుల్లో కూలీలకు పనేంటీ? - వెంకయ్య

కూలీలు.. సహకరించకండి!

Posted On 08/04/2015 12:21:42PM IST
 
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల్లో కూలీలకు పనేంటని నిలదీశాడు. అలాగే ఎర్రచందనం చెట్లను నరకడం నేరమన్న విషయం కూలీలకు తెలియదా? అంటూ వెంకయ్య నిలదీశాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ స్మగ్లింగ్ కు కూలీలు సహకరించడం సరికాదని హితవు పలికారు. అలాగే ఏ పనులకు కూలీలకు వెళుతున్నారో తెలియకుండా వెళుతున్నారా? అంటూ వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎన్ కౌంటర్ పై విచారణకు ఆదేశించామని, విచారణ అనంతరం నిజానిజాలు బయటకు వస్తాయని వెంకయ్య స్పష్టం చేశారు.

కూలీలకేం పనన్న వెంకయ్య, శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హెచ్ఆర్సీ ఆగ్రహం

మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (20:08 IST)
venkaiah naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత వ్యవహారంలో మంగళవారంనాడు జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పందిస్తూ, అసలు అడవుల్లో కూలీలకు ఏం పని అంటూ ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ ను కూడా ఉటంకిస్తూ ఉగ్రవాదులపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెంచాలని సూచించారు. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.
 
మరోవైపు శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఆంధ్రప్రదేశ్ - తమిళనాడుల మధ్య అగాధాన్ని పెంచిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. అలాగే తమిళ కూలీలు ఎన్‌కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. 
 
ఈ లేఖలో ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కూలీల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. మరోవైపు రాజకీయ నేత వైగో కూడా తమిళ కూలీలపై నిష్పక్షపాతంగా కాల్పులు జరిపారని మండిపడుతూ ఆంధ్రాబస్సులు, ఆంధ్రా సంస్థలపై దాడి చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆంధ్రా సంస్థల వద్ద భద్రతను పెంచారు. 
 
ఎన్‌కౌంటర్‌పై సమగ్ర జరపాలని.. అసలైన దొంగలు పారిపోయారని, అమాయక కూలీలే కాల్పులకు బలైపోయారని తమిళ రాజకీయ పార్టీలతో పాటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి కూడా మండిపడ్డారు. ఇంకా మానవహక్కుల సంఘానికి వీరా లేఖ రాశారు. అంతేగాకుండా తమిళనాడులో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ తమిళనాడు-ఆంధ్రప్రదేశ్‌‍ల మధ్య అగాధం ఏర్పడిందని అంటున్నారు. 
 
అయితే ఇంతకుముందు శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కనుమరుగైందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకుముందు తమిళ కూలీలు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసిన ఘటనలున్నాయని.. పోలీసులపై స్మగ్లర్లు దాడికి పాల్పడటంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు. మరి దీనిపై సమగ్ర నివేదిక వచ్చేంతవరకు ఆగాల్సిందేనని, ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు సర్కారుకు, కేంద్రానికి ఏమేరకు సమాధానమిస్తారో వేచి చూడాల్సిందే

No comments:

Post a Comment