|
ఎర్ర దుంగలు తరలిస్తున్న 134 మంది అదుపులోకి
రూ.2 కోట్లకుపైగా విలువైన దుంగలు స్వాధీనం
పలు వాహనాలు, గొడ్డళ్లు కూడా..
పలు జిల్లాల్లో కూంబింగ్
తిరుపతి, ఆత్మకూరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఎన్‌కౌంటర్ ఘటనతోనూ ఎర్ర దొం గలు వెనక్కుతగ్గినట్టు కనిపించడం లేదు. అడవుల్లోకి చొరబడి ఎర్రచందనం దుంగల ను యథేచ్ఛగా వాహనాల్లో తరలిస్తున్నారు. శని, ఆదివారాల్లో కడప, నెల్లూరు జిల్లాల్లో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు 134 మంది ఎర్ర దొంగలు పట్టుబడ్డారు. వీరి నుంచి 2 కోట్లకుపైగా విలువైన ఎర్రచందనం దుంగ లు, వాహనాలు, సెల్‌ఫోన్లు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మృతిచెందగా, మిగిలినవారు తప్పించుకున్నారు. వారిని పట్టుకోవడానికి 400 మంది పోలీసులను ఐజీ వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో అడవుల్లోకి దించారు. మరోవైపు కడప, నెల్లూరు, చిత్తూ రు జిల్లాల పోలీసులూ ఎర్రదొంగల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో నెల్లూ రు, రాపూరు, కడప జిల్లా రాజంపేటల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మం డలంలో 61 మంది ఎర్రకూలీలు పట్టుబడ్డా రు. వీరినుంచి నాలుగు వాహనాలు, 11 సెల్‌ఫోన్లు, కొన్ని గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సరిహద్దులో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ముంద స్తు సమాచారం మేరకు అనంతసాగరం మండలంలోని చాపురాళ్లపల్లి గ్రామ శివారులోని వెంకయ్యస్వామి గుడి వద్దకు వెళ్లిన పోలీసులకు అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలు కంటపడ్డాయి. పోలీసులను చూసి సుమారు 30మంది కూలీలు పరారయ్యారు. ఇద్దరిని అదుపులో కి తీసుకుని విచారించగా, 16మంది ఆచూకీ తెలిసింది. ఆదివారం బొమ్మవరం శివార్లలో ఆ 16 మందినీ అదుపులోకి తీసుకున్నారు. ఒక లారీ, 17 దుంగల ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మల్లెంకొండ శిలల వద్ద గాలిస్తున్న పోలీసులపై 43 మంది కూలీలు దౌర్జన్యానికి దిగి, రెండు వాహనాల్లో ఎర్రచందనం దుంగలతో పారిపోయారు. ఆత్మకూరు డీఎస్పీ రంగంలోకిదిగి 43 మంది కూలీలను అరెస్ట్ చేశా రు. వారినుంచి లారీ, టెంపో, కారు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 13 ఎర్ర దుంగలు, గొడ్డళ్లు, వేయింగ్‌మిషన్ కూడా స్వాధీనపరచుకున్నారు. పట్టుబడిన ఎర్ర కూలీలంతా 16-20 ఏళ్లలోపు వారే. వీరంతా తమిళనాడులోని తిరువణ్ణామలై, విల్లుపురం, వేలూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు.
|
No comments:
Post a Comment