హైదరాబాద్, ఏప్రిల్ 10 : శేషాచలం ఎన్‌కౌంటర్‌పై తమిళనాట ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించామని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ ఎల్వకు లేఖ రాశారు. విచారణ వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. విచారణ అనంతరం నివేదిక వస్తే వాస్తవాలు వెల్లడవుతాయని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన ఎండీఎంకే నేత వైగోను వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం 500 మంది కార్యకర్తలతో వేలూరు నుంచి చిత్తూరుకు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన వైగోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వేలూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైగో అరెస్ట్‌తో ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది.
No comments:
Post a Comment