ఎర్రచందనం స్మగ్లింగ్: పక్కా నెట్‌వర్క్
http://telugu.oneindia.com/news/andhra-pradesh/sandalwood-smuggling-how-they-operate-153940.html
అదేమిటి? Posted by: Pratap Published: Wednesday, April 8, 2015, 11:35 [IST] Share this on your social network: FacebookTwitterGoogle+ CommentsMail చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్, చెట్ల నరికివేత ఆగకపోవడానికి స్మగ్లర్ల బలమైన నెట్‌వర్క్ కారణమని చెబుతున్నారు. కూలీల వెనక బలమైన నెట్‌వర్క్ ఉంటుంది. కూలీల కుటుంబ పరిస్తితులను ఆసరా చేసుకుని కీలో ఎర్రచందనానికి రూ.600 వరకు చెల్లిస్తామని, దీంతో కూలీలు ఆశపడి ఎర్రచందనం చెట్లను నరకడానికి వస్తున్నారని అంటున్ నారు. తమిళనాడులోని జవ్వాది కొండల ప్రాంతంలో కొన్ని వందల గ్రామాలకు ఎర్రచందనం చెట్లను నరకడమే వృత్తిగా ఉంది. దీనికోసం ప్రతి గ్రామంలో దళారీ ఉంటాడు. స్మగ్లర్లు వీరిని సంప్రదించి కూలీలను సేకరిస్తారు. వాళ్ల కుటుంబాలకు అడ్వాన్సు, భత్యా ల చెల్లింపు తదితరాలన్నీ దళారులే పూర్తిచేస్తారు. ఆ కూలీలను ఆటోలు, లారీలు, ట్రాక్టర్లలో దళారులు తరలిస్తారు. పకడ్బందీగా బ్యాచ్‌కి 50మంది వంతున విడతలవారీగా విరామంతో తరలిస్తారు. అనుకున్న స్థలానికి చేరుతుండగా వాహనాలను ఆపుతారు. పరిసరాల్లో సిద్ధంగా ఉన్న గైడ్లకు కూలీలను అప్పగించి వెళ్లిపోతారు. ఇక గైడ్లవెంట అడవిలోకి కూలీలు ప్రవేశిస్తారు చెట్లను కొట్టిన తర్వాత బెరడును చెక్కేస్తారు. తర్వాత గైడు సూచన మేరకు వివిధ ఆకారాలు, సైజుల కిందకు కొట్టి, భుజాన పెట్టుకొని అడవి అంచులకు నడుస్తారు. అక్కడ సిద్ధంగా ఉండే వాహనాల్లో జాగ్రత్తగా సర్దుతారు. మీడియా కథనాల ప్రకారం - చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో రోజుకు రూ.3కోట్లకుపైగా విలువైన ఎర్రచందనం దాటిపోతున్నట్లు ఒక అంచనాయ ఓ బ్యాచ్ ఐదు నుంచి పది రోజులవరకూ పనిచేసి వెనుదిరుగుతుంది. తర్వాత రెండో బ్యాచ్ రంగంలో దిగుతుంది. అడవిలో ఉన్నంతకాలమూ కూలీల తిండితిప్పలకు స్మగ్లర్లు లోటు రానీయరు. చెట్టు వయసు, చుట్టుకొలత, పొడవు ఆధారంగా చేవను నిర్ణయిస్తారు. ఇందుకోసం స్మగ్లర్లు ప్రత్యేక బృందాలను దించుతారు. వీరు అడవులను జల్లెడ పడుతూ మంచి కలప దొరికే ప్రాంతాలను గుర్తిస్తారు. దానితో స్మగ్లర్ల దాడి మొదలవుతుంది. ఏపీలో 5జిల్లాల పరిధిలో దట్టంగా అరణ్యం అల్లుకుపోవడంతో ఎటునుంచి దాడి జరుగుతుందో గుర్తించడం కష్టం. పైగా, ఇక్కడి కలపకు మం చి డిమాండ్ ఉంది. చిన్న దుంగను అమ్ముకుంటే రూ.లక్ష జేబులో పడతాయి. దీంతో అడవిలో చెట్లు నరకడం నుంచి అడవి అంచుకు మోసుకొచ్చేవరకూ స్మగ్లర్లు చురుగ్గా వ్యవహరిస్తారు. అనుమానం రాకుండా వివిధ సైజుల్లో కొట్టించిన దుంగలను కార్లు, సుమోలు, ఆర్టీసీ బస్సులుసహా ప్రతి రవాణా, ప్రయాణ వాహనంలో సరిహద్దులు దాటించేస్తారు. వీటిని కడప మీదుగా కర్ణాటకకు, చిత్తూరు మీదుగా తమిళనాడుకు తరలించడంలో పక్కావ్యూహంతో వ్యవహరిస్తారు. శేషాచలం, పాలకొండ అడవుల్లోకి రాకపోకలకు పదికిపైగా రూట్లున్నాయి. వీటిలో కూలీల తరలిం పునకు కొన్నిటిని, కొట్టిన సరుకు తీసుకెళ్లేందుకు మరికొన్ని దారులను వాడుకుంటారు. ప్రధాన స్మగర్లంతా కర్ణాటక, తమిళనాడుల్లో తిష్టవేసి, సరుకు ను గిడ్డంగులకు తరలిస్తారు. రెండురాష్ర్టాల కన్ను గప్పి విదేశాలకు తరలింపు ఏర్పాట్లు చేస్తారు. కర్ణాటక, తమిళనాడుల్లో ఎర్రచందనం అక్రమ తరలింపుపై చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తారు. దాంతో గిడ్డంగుల్లోని ఎర్రచందనం సాఫీగా చెన్నై పోర్టుకు చేరుతుంది. చివరకు గూడ్సు రైళ్లలోనూ తరలిస్తున్నారు. ఏపీ ఒత్తిడివల్ల చెన్నై రేవులో తనిఖీ కట్టుదిట్టంచేశారు. దీంతో ముంబై, గుజరాత్, కోల్‌కతాలకు తీసుకెళ్లి ఓడల్లో ఎక్కిస్తున్నారు. కొన్ని సమయాల్లో రోడ్డు మార్గంలో నేపాల్ మీదుగా తరలిస్తున్నారు.
Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/sandalwood-smuggling-how-they-operate-153940.html
No comments:
Post a Comment