Thursday, 9 April 2015

కూలీలది సర్కారీ హత్యే: సీపీఐ నారాయణ

కూలీలది సర్కారీ హత్యే: సీపీఐ నారాయణ

Sakshi | Updated: April 09, 2015 02:53 (IST)
కూలీలది సర్కారీ హత్యే: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో 20 మంది కూలీల ఎన్‌కౌంటర్ సర్కారీ హత్యేనని, తెలంగాణలో ఉగ్రవాది వికారుద్దీన్, అతని సహచరులది బోగస్ ఎన్‌కౌంటరేనని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ ధ్వజమెత్తారు. వీటిపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌చేశారు. చిత్తూరు ఎన్‌కౌంటర్‌లో మరణించిన కూలీల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌చేశారు.

బుధవారం మఖ్దూంభవన్‌లో పార్టీనాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, రవీంద్రకుమార్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట ఘటనపై మాట్లాడుతూ, హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి  మంత్రి పదవికి అనర్హుడని అన్నారు.
 వికారుద్దీన్, అతని సహచరుల ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఆధునిక వాహనాలను ఇవ్వడమే తప్ప అధునాతన ఆయుధాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు

No comments:

Post a Comment