అంతం కాదు.. ఆరంభమే: బొజ్జల
Sakshi | Updated: April 09, 2015 02:46 (IST)

ఆ కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది స్మగ్లర్లు కాదు తమిళనాడుకు చెందిన కూలీలే కదా అన్న ప్రశ్నకు బొజ్జల స్పందిస్తూ.. కూలీలకు అర్ధరాత్రి అడవిలో ఏం పనంటూ ఎదురుదాడికి దిగారు. కూలీలైతే అర్ధరాత్రి అడవిలో గడ్డికోసుకోవడానికి వెళ్లారా అంటూ ఎద్దేవా చేశారు. గతంలో పోలీసులు అరెస్టు చేసిన కూలీలనే ఎన్‌కౌంటర్‌లో చంపేశారన్న విమర్శలు వ్యక్తమవుతోండటాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. అవన్నీ ఒట్టి పుకార్లేనంటూ కొట్టిపారేశారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా, రాజకీయ అండదండలున్నా వదిలి పెట్టబోమన్నారు. రాజకీయ నాయకులకు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు దొరికితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment