'చంద్రబాబుపై 302 కేసు నమోదు చేయాలి'
Sakshi | Updated: April 18, 2015 10:07 (IST)
తిరుపతి : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగినది బూటకపు ఎన్ కౌంటర్ అని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు తెలిసే అక్కడి పోలీసులు కూలీలను చంపేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై వెంటనే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ఎన్ కౌంటర్ ను సమర్థిస్తూ మాట్లాడిన అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని బర్తరఫ్ చేయాలన్నారు. ఎన్ కౌంటర్ మీద ఇతర రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment