Wednesday, 8 April 2015

స్మగ్లింగ్‌లో టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం

స్మగ్లింగ్‌లో టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం

635641137238125076
రెండు రాష్ర్టాల్లో ఎన్‌కౌంటర్లు పథకం ప్రకారం జరిగాయని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. పోలీసుల కనుసన్నల్లోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందని, ఎర్రచందనం సరఫరాకు పోలీసులే సహకరిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు రాష్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ నేతల్లో కొందరికి స్మగ్లింగ్‌తో సంబంధాలున్నాయని, ఆ వివరాలు బయటికి రాకుండా ఉండాలనే కూలీలను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేశారని నారాయణ ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే స్మగ్లర్లను పట్టుకోవాలని నారాయణ సవాల్‌ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఎన్‌కౌంటర్‌ మాయని మచ్చగా అభివర్ణించారు.
తెలంగాణలో జరిగిన వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కూడా బూటకపు ఎన్‌కౌంటరేనని నారాయణ ఆరోపించారు. సిద్ధయ్య కుటుంబానికి రూ. కోటి పరిహారమివ్వాలని ఆయన టి సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. నల్గొండ జిల్లాలో పోలీసులపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి బాధ్యాతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. ఆప్పుడే మేల్కొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. హోం మంత్రి పదవికి నాయిని సరిపోరని, నాయిని హోం మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment