Monday, 20 April 2015

న ల్లమల టు ఫారిన్‌! (27-Aug-2014)

న ల్లమల టు ఫారిన్‌! (27-Aug-2014)
రుద్రవరం: ప్రపంచంలో అరుదైన వృక్ష సంపదకు కేరాఫ్‌ నల్లమల. అందులోనూ ఎర్రచందనానికి నెలవు. దీని ఉపయోగాలపై అనేక ప్రచారాలు ఉన్నాయి. అందు వల్ల కూడా ప్రపంచ మార్కెట్లో దాని విలువ పెరిగిపోయింది. దీంతో అంతర్జాతీయ స్మగ్లర్ల కన్ను దీనిపై పడిం ది. శాంటాలినన్‌ టెరాకార్షప్‌ అనే శాస్ర్తీయ నామం ఉన్న ఎర్రచందనం చెట్టును నరికితే దానికాండం చుట్టూ పదుల సంఖ్యలో కొత్తగా మొలకలు వస్తాయి. ఇటీవల ఎర్రచంద నం స్మగ్లర్ల పేరుతో జరుగుతున్న ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో దీని అక్రమ రవాణా చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా నంద్యాల ఫారెస్టు డివిజన్‌లోని రుద్రవరం రేంజిలో ఎర్ర చందనం విస్తారంగా ఉంది. ఇక్కడ నిత్యం ఎర్ర చందనం చెట్లు స్మగ్లర్ల ఽగొడ్డలి వేటుకు నేల కూలుతున్నాయి.
రాష్ట్రంలో 40,435 చ.కి.మీ అడవులు విస్తరించి ఉన్నా యి. వీటిలో రాయలసీమలో 23.53 శాతం అడవులు ఉ న్నాయి. నల్లమలలో అనేక రకాల అటవీ సంపద ఉంది. అం దులో ఎర్ర చందనం ముఖ్యమైనది. ఇది కడప జిల్లాలో 73 శాతం, చిత్తూరులో 18 శాతం, కర్నూలులో 2.3 శా తం, నెల్లూరులో 0.4 శాతం ప్రకాశం జిల్లాలో 0.2 శాతం అడవుల్లో ఉంది. ఇంతవిలువైన సంపద ఉన్నందున నల్లమల మీద స్మగ్లర్స్‌ కన్నుపడింది. పైగా ఇటీవల ఎర్రచందనానికి అనేక రకాలుగా దేశదేశాల్లో ప్రాచుర్యం పెరిగింది. ఎర్ర చందనం వినియోగం సంపన్నుల హోదాకు గుర్తుగా మారింది. అయితే ఎర్రచందనం పరిరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నందున అక్రమమార్గాల్లో తరలించడం పెరిగిపోయింది.
ఎర్రచందనం సంపద నాలుగు గ్రేడ్‌లు
ఎర్రచందనం సంపదను ఎ, బి, సి, డి గ్రేడ్‌లుగా విభజించారు. గ్రేడ్‌ల వారీగా మార్కెట్‌లో రేటు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎ గ్రేడ్‌ టన్ను 40 నుంచి 50, బి గ్రేడ్‌ 30 నుంచి 40, సి గ్రేడ్‌ 25 నుంచి 35, డి గ్రేడ్‌ 10 నుంచి 25 లక్షలు పలుకుతున్నట్లు సమాచారం.
అక్రమ రవాణా ఇలా..
నల్లమల నుంచి స్మగ్లర్లు ఎర్రచందనం వృక్షాలను కూ లీలతో నరికించి దుంగల రూపంలో బయటికి తరలిస్తున్నారు. గతంలో వీటిని అడవిలోనే ట్రాక్టర్లు, ఆటోలు, లా రీలు, జీపులకు స్మగ్లర్లు లోడ్‌ చేసేవారు. మరి కొంత కా లానికి కూలీలు సైకిళ్లకు ఇరువైపులా కట్టుకొని కాలిబాటలో తరలిస్తున్నారు. ప్రస్తుతం సైకిళ్లపైన, భుజాలపైన మోసుకొని అటవీ సమీప గ్రామాలకు చేర్చుతున్నారు. అక్కడి నుంచి గతంలో వాహనాల్లో తరలిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా 18వ జాతీయ రహదారిపైకి తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో లోడ్‌ చేసి తరలిస్తున్నారు. రహదారి ప్రాంతంలో నీటిలో, మోరీలో కింద, బావుల్లో ఉంచి అవకాశం చూసుకొని అక్కడి నుంచి బయటి ప్రాం తానికి తరలిస్తున్నారు. అధికారులను ఏమార్చుతూ స్మగ్లర్లు పలు మార్గాల్లో ఎర్రచందనం తరలిస్తున్నారు. చిన్న చిన్న తుంటలుగా మార్చి చేతి సంచుల్లో కూడా తరలిస్తున్నా రు. ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల ఎర్ర చందనం తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. మరి కొందరు పొడి చేసి తరలిస్తున్నారు. అరుదైన ఎర్రచందనాన్ని కా పాడటానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. అక్రమ రవాణాను 1958లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 1966లో ప్లైయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం సంపదను కాపాడేందుకు చట్టాలను అమలు చేసింది. అయితే ఫారెస్టు అధికారుల నిర్లక్ష్యం స్మగ్లర్లకు వరంగా మారింది. దీంతో అడవిలోని విలువైన ఎర్రచందనం తరలిపోతోంది. అడవి మైదానంలా మారు తోంది. ఈ దేశ ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను అక్రమ మార్గాల్లో కొందరు సొంతం చేసుకుంటున్నారు.
జలమార్గంలో దేశ సరిహద్దులు
జల, వాయుమార్గాల్లో విదేశాలకు ఎర్రచందనం వృక్ష సంపద తరలి వెళ్తోంది. 90 శాతం జల మార్గంలో, 10 శాతం వాయు మార్గంలో అక్రమ రవాణా అవుతోంది. ఇటీవలే వాయుమార్గంలో భాగంగా హైదరాబాదు బేగంపేట విమానాశ్రమంలో ఎర్రచందనం పొడి పట్టుబడిన విషయం విదితమే. జల మార్గంలో చెన్నై, ముంబై ప్రాం తాల నుంచి హార్బన్‌లలో చేర్చి తరలిస్తున్నారు. శ్రీలంక, హాలెండ్‌, హాంకాంగ్‌, జపాన్‌, చైనా, స్విట్జర్లాండ్‌, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌, మలేషియా, బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు తరలి వెళ్తోంది.

No comments:

Post a Comment