Wednesday, 8 April 2015

శేషాచలంలో మళ్లీ మంటలు..

శేషాచలంలో మళ్లీ మంటలు..

13:21 - April 3, 2015
తిరుపతి : శేషాచలం అడవుల్లో మళ్లీ నిప్పు రాజుకుంది. శేషాచలం కొండలకు ఆనుకుని ఉన్న కరకంబాడి ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మూడు కిలోమీటర్ల వరకు మంటలు వ్యాపించాయి. గాలి కూడా వేగంగా వీస్తుండడంతో మంటలు విస్తరిస్తున్నాయి. సమీపంలో ఉన్న కరకంబాడి గ్రామంవైపు మంటలు వ్యాపించడంతో గ్రామ ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. మంటలు ఎలా వ్యాపించాయో అర్థం కావడం లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
దేశంలో అరుదైన అటవీ సంపదకు, వృక్షజాతులకు, జంతుజాలానికి అవలాలమైన అటవీ సంరక్షణ ప్రాంతాలలో ఏడు కొండలకు విస్తరించి ఉన్న శేషాచల అటవీ ప్రాంతం ఒకటి. ప్రతి ఏటా ఎండాకాలంలో తిరుమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు సంభవించడం సర్వసాధారణమై పోయింది. గత ఏడాది మార్చి 18వ తేదీన శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో25వేల ఎకరాల అటవీ ప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఎంతో విలువైన వన్యసంపద బూడిదైంది. ఎన్ని జంతువులు అగ్నికి ఆహుతయ్యాయో తెలియని పరిస్థితి. వేల ఎకరాల అటవీ సంపద అగ్నికి ఆహుతి కావడానికి అటు టిటిడి, ఇటు ఫారెస్టు శాఖల నిర్లక్ష్య ధోరణులే కారణమనే విమర్శలు వినిపించాయి. 

No comments:

Post a Comment