Wednesday, 15 April 2015

ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్టు మాకివ్వండి

ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్టు మాకివ్వండి

Sakshi | Updated: April 15, 2015 12:48 (IST)
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్ కౌంటర్ పై విచారణ గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ కు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను, చనిపోయిన వ్యక్తుల శవ పరీక్ష నివేదికలను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ను ఆదేశించింది. సిట్ దర్యాప్తును తామే మానిటరింగ్ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

మరోపక్క, బుధవారం నాటి విచారణ సందర్భంగా హైకోర్టుకు ఎన్ కౌంటర్లో మృతి చెందిన శశికుమార్ భార్య మునియమ్మాల్ హైకోర్టులో హాజరైంది. ఈ సందర్భంగా ఆమెను ప్రతి వాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, మరోసారి పోస్టు మార్టం నిర్వహించాలని మునియమ్మాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క, ఎన్ కౌంటర్ పై విచారణ కోసం సిట్ ను ఏర్పాటుచేశామని హైకోర్టుకు చెప్పినట్లు ఏపీ అడ్వకేట్ జనరల్ తెలిపారు.

No comments:

Post a Comment