Sunday 26 April 2015

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు-చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు-చంద్రబాబు

  0 
 
  0  0
Chandrababu naidu told Andhrapradeh correct place of investments
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చైనా పర్యటనలో భాగంగా మంగళవారం పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కరణల తర్వాత చైనాలో వృద్ధిరేటు పెరిగిందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల తర్వాత చైనాలో రెండంకెల వృద్ధిరేటు వచ్చిందన్నారు. రాబోయే మూడు, నాలుగు దశాబ్దాలు మనవే అని చంద్రబాబు తెలిపారు.
chandrababu in china
కేంద్ర ప్రభుత్వంలో తాము భాగస్వాములమని అక్కడి పారిశ్రామిక వేత్తలకు తెలియజేశారు. తూర్పు తీరానికి ఏపీ ముఖద్వారం అన్న బాబు ఏపీలో 970 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని చెప్పారు. విద్యుత్‌ రంగంలో మెదటిస్థానంలో ఉన్నాం…నీటి కొరత లేదని వెల్లడించారు. మూడు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సింగిల్‌విండోతో పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని చెప్పారు. ఇండియాలో హార్డ్‌వేర్‌ అభివృద్ధికి చైనా సహకరిస్తే చైనాలో సాఫ్ట్‌వేర్‌ పార్కుల అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటామన్నారు.
 
ఏపీలో అపారంగా ఎర్రచందనం నిల్వలున్నాయని, వాటిలో చైనా ఇప్పటికే భారీగా కొనుగోలు చేసినట్లు సీఎం తెలిపారు. గ్విజుప్రావిల్స్‌ బృందం నేత మాట్లాడుతూ ఏపీలో విండ్‌ పవర్‌ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. విండ్‌ టర్బైన్ల తయారీలో తమది అగ్రస్థానం అని, ఇండియా సాఫ్ట్‌వేర్‌తో చైనా హార్డ్‌వేర్‌ను అనుసంధానిస్తామని తెలిపారు. ఏపీలో టెన్నల్స్‌, వంతెనల నిర్మాణానికి మరో కంపెనీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
- See more at: http://ttimenews.com/chandrababu-naidu-told-andhrapradeh-correct-place-of-investments/#sthash.dI06yf6y.dpuf

No comments:

Post a Comment